Hyderabad, ఫిబ్రవరి 21 -- OTT Telugu Comedy Movie: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు కూడా ఒకటికి మంచి ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కథా కమామీషు అనే మూవీ.. శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి మరో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టడం విశేషం.

తెలుగు కామెడీ డ్రామా కథా కమామీషు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చింది. ఈ ఏడాది జనవరి 2న ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఇదే సినిమాను ఇప్పుడు సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ప్రేమ ఒక్కసారే కాదు.. ఎప్పుడు రెండు హృదయాలు చేరువైనా పుడుతుంది. సెకండ్ ఛాన్సెస్, ప్రేమకు సంబంధించిన ఈ అం...