Hyderabad, ఫిబ్రవరి 17 -- OTT Telugu Comedy Movie: ఓటీటీలో తెలుగు కామెడీ డ్రామాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో తాజాగా రిలీజైన ధూమ్ ధామ్ మూవీ నిరూపిస్తోంది. జనవరి 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సినిమా.. రెండు వారాల్లోనే రికార్డు స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకోవడం విశేషం. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ఇది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ధూమ్ ధామ్ మూవీ రెండు వారాల్లోనే 40 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. జనవరి 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.

థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేక...