భారతదేశం, మార్చి 15 -- 'బ్రహ్మ ఆనందం' సినిమా మంచి హైప్‍తో వచ్చింది. కామెడీ బ్రహ్మా బహ్మానందం చాలాకాలం తర్వాత ఓ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషించారు. తండ్రీ కొడుకులు ఈ మూవీలో తాతమనవళ్ల రోల్స్ చేశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన బ్రహ్మా ఆనందం మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

బ్రహ్మా ఆనందం మూవీ మార్చి 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ముందుగా ఫిబ్రవరి 14నే ఈ చిత్రం ఆహాలోకి ఎంట్రీ ఇస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, చివరి నిమిషాల్లో వాయిదా పడిందని తెలుస్తోంది. బ్రహ్మా ఆనందం సినిమాను మార్చి 19వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసు...