Hyderabad, మార్చి 10 -- Home Town OTT Release And Teaser Released: ఓటీటీలో ఇటీవల కాలంలో తెలుగు కంటెంట్ పెరిగిపోయింది. విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే కామెడీ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌లను సైతం తెరకెక్కిస్తున్నారు.

అలా ఇటీవల ఈటీవీ విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే జోనర్‌లో ఈ సిరీస్ మేకర్స్ నుంచే మరో తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ రానుంది. అదే హోమ్ టౌన్. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.

#90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌ను రూపొందించిన నవీన్ మేడారం నిర్మాణంలో హౌమ్ టౌన్‌ను నిర్మించారు. హౌమ్ టౌన్ వెబ్...