Hyderabad, ఏప్రిల్ 6 -- Muthayya OTT Release: అవార్డు విన్నింగ్ మూవీ ముత్తయ్య ఓటీటీలోకి స్ట్రీమింగ్‌ కానుంది. 2022లో తెలుగులో కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ముత్తయ్య ఓటీటీ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. సినిమాల్లో నటించాలనే కలగనే 70 ఏళ్లు వృద్ధుడి కథను తెరపై హృద్యంగా ఆవిష్కరించిందీ సినిమా.

తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు అధిగమించిన ముత్తయ్య జర్నీ ఎంతో స్పూర్తిని పంచుతుంది. ముత్తయ్య సినిమాకు డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె. సుధాకర్ రెడ్...