Hyderabad, మార్చి 13 -- OTT Telugu Action Drama: ఈటీవీ విన్ ఓటీటీలోకి ఇప్పుడు గతేడాది నవంబర్లో రిలీజైన తెలుగు సినిమా రాబోతోంది. ఇదో బయోపిక్ కావడం విశేషం. థియేటర్లలో రిలీజై ఐదు నెలలైనా డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి వచ్చే వారమే ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఓటీటీలోకి రాబోతున్న తెలుగు యాక్షన్ డ్రామా పేరు జితేందర్ రెడ్డి. గతేడాది నవంబర్ 8న థియేటర్లలో రిలీజైంది. విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని గురువారం (మార్చి 13) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.

"ఓ లీడర్. ఓ ఫైటర్. ఓ విప్లవం. జితేందర్ రెడ్డి ఎదుగుదల చూడండి. ఇది పవర్, తిరుగుబాటుకు చెందిన స్టోరీ. మార్చి 20 నుంచి ఈటీవీ విన్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. విరిం...