Hyderabad, ఫిబ్రవరి 1 -- Coffee With A Killer OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు వస్తుంటాయి. వాటిలో తెలుగులో వచ్చేవి కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌కు కాస్తా కామెడీ యాడ్ చేసే సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. అలా తెలుగులో తాజాగా తెరకెక్కిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే కాఫీ విత్ ఏ కిల్లర్.

టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, డైరెక్టర్ రవిబాబు, అంబటి శ్రీను, నేక్‌డ్ ఫేమ్ శ్రీరాప, జెమిని సురేష్, టెంపర్ శీను తదితరులు కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాకు నిర్మాతగా వ్యవహర...