భారతదేశం, జనవరి 24 -- టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీ మూవీతో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ ఆ తర్వాత స్వాతి ముత్యం, స్టాండప్ రాహుల్, ఊరు పేరు భైరవకోన, తమ్ముడు సినిమాలతో అలరించింది.

సినిమాలతోనే కాకుండా ఓటీటీ సిరీస్‌ కానిస్టేబుల్ కనకంతో కూడా అట్రాక్ట్ చేసింది వర్ష బొల్లమ్మ. తెలుగు ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కానిస్టేబుల్ కనకం నుంచి ఇప్పటికి రెండు సీజన్స్ వచ్చి అలరించాయి. ఈటీవీ విన్‌లో కానిస్టేబుల్ కనకం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ అందరిని మెప్పిస్తోంది.

అయితే, ఈ రెండు సీజన్స్‌తో కలిపి ఓ సినిమాగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 టైటిల్‌తో మరో మూ...