భారతదేశం, జనవరి 30 -- హరిద్వార్‌ వంటి ఒక చిన్న పట్టణంలో, హిందీ మాట్లాడే కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. దక్షిణ భారత సినీ రంగంలో రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలుగుతుందని ఎవరూ ఊహించలేదు. భాష తెలియదు, సంస్కృతి కొత్త.. అయినా సరే, శ్రియా శరణ్ సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తనపై ఉన్న 'సౌత్ హీరోయిన్' అనే ముద్ర గురించి శ్రీయా శరణ్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "నేను హరిద్వార్‌లో పుట్టాను. 17 ఏళ్ల వయసు వరకు అక్కడే ఉన్నాను. కథక్ నేర్చుకోవడం కోసం ఢిల్లీకి మారడం నా జీవితంలో మొదటి పెద్ద మలుపు" అని శ్రియా శరణ్ అన్నారు.

"మా నాన్న ఇంజనీర్, అమ్మ టీచర్.. అలాంటి క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చి నేను నటిని అవుతానంటే అం...