Hyderabad, ఫిబ్రవరి 3 -- OTT Tamil Romantic Movie: తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పేరు కాదలిక్క నేరమిళ్లై (Kadhalikka Neramillai). అంటే ప్రేమించడానికి సమయం లేదు అని. నిత్య మేనన్ నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.16.5 కోట్లు వసూలు చేసి మంచి విజయం సాధించింది.

తమిళంలో గత నెల రిలీజై సూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు టైమ్స్ నౌ రిపోర్టు వెల్లడించింది.

సుమారు రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ...