Hyderabad, ఏప్రిల్ 11 -- OTT Tamil Horror: ఈమధ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి హారర్ సినిమాలు క్యూ కడుతున్నాయి. వివిధ భాషలకు చెందిన భయపెట్టే మూవీస్ కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మరో తమిళ హారర్ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు ముర్ముర్ (Murmur).

తమిళ హారర్ మూవీ ముర్ముర్ మార్చి 7న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడీ మూవీ ఏప్రిల్ 17 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హేమనాథ్ నారాయణన్ డైరెక్ట్ చేసిన ముర్ముర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఏం చేస్తుందో చూడాలి.

ముర్ముర్ సినిమా కొందరు యూట్యూబర్ల చుట్టూ తిరుగుతుంది. అతీత శక్తుల వేటలో ఉండే వాళ్లు.. ఓ శాపగ్రస్తమైన అడవిలోకి దెయ్యాన్ని వెతుకుతూ వెళ్తారు. అయితే అక్కడ వా...