Hyderabad, ఏప్రిల్ 2 -- OTT Tamil Comedy Movie: తమిళ కామెడీ సినిమాలంటే ఇష్టమా? అయితే మీ కోసమే ఇప్పుడో కామెడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు బేబీ అండ్ బేబీ. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. గతంలోనే ఓ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు రెండో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతోంది.

జై, సత్యరాజ్ లాంటి తమిళ యాక్టర్స్ నటించిన మూవీ బేబీ అండ్ బేబీ. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4 నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే సన్ నెక్ట్స్ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. మార్చి 21 నుంచే ఈ మూవీ అందులో స్ట్రీమింగ్ అవుతోంది. నవ్వుల వినోదం పక్కా అంటూ ఆ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ను కూడా ట్వీట్ చ...