భారతదేశం, ఏప్రిల్ 13 -- ఓటీటీల్లో కొత్త కామెడీ సినిమాలు చూడాలనుకునే వారికి ఈ వారం రెండు తమిళ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీలతో ఈ చిత్రాలు తెరకెక్కాయి. ఈ వారమే ఈ రెండు సినిమాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవే 'పెరుసు', 'స్వీట్‍హార్ట్' చిత్రాలు. తెలుగు డబ్బింగ్‍లోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ సినిమాలు ఏ ఓటీటీలోకి వచ్చాయో, స్టోరీలైన్, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పెరుసు మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో వైభవ్, సునీల్ రెడ్డి, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ తమిళ కామెడీ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలైన్: ఊరు పెద్ద అయిన పరందామయ్య చనిపోతాడు. అయితే ఆయన అంగం స్థంభించి ఉంటుంది. ఇది ఎవరైనా గమనిస్తే పరు...