Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Tamil Bold Comedy: బోల్డ్ కామెడీ మూవీకి అర్థాన్ని మార్చేసింది ఓ తమిళ సినిమా. బోల్డ్ అంటే మరీ ఇంత బోల్డ్ గానా అన్నట్లుగా ఈ సినిమాను తీశారు. గత నెల థియేటర్లలోకి వచ్చినప్పుడే తమిళనాట సంచలనం సృష్టించగా.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చి తెలుగు ప్రేక్షకులను కూడా నోరెళ్లబెట్టేలా చేస్తోంది. మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు పెరుసు (Perusu).

తమిళ బోల్డ్ కామెడీ మూవీ పెరుసు. అంటే తెలుగులో పెద్దమనిషి అని అర్థం. సినిమాలోని ఓ పెద్దమనిషి చుట్టూ తిరిగే మూవీయే ఇది. సినిమా మొదట్లోనే అతడు కన్నుమూస్తాడు. ఇంట్లో టీవీ చూస్తూ కుర్చీలోనే కన్నుమూసిన అతన్ని పెద్ద కొడుకు చూస్తాడు. అతడు చనిపోయాడన్న బాధ కంటే కూడా కింద చూసి షాక్ తింటాడు. ఎందుకంటే అంతకుముందే అతడు 'ఆ' ట్యాబ్లెట్లు వేసుకొని ఉండటంతో అంగం గట్టి పడి ఉంటుంది.

ఇక అక్కడ మొదలవుతాయి ఆ...