భారతదేశం, మార్చి 3 -- విదాముయర్చి చిత్రం భారీ అంచనాలతో వచ్చినా.. ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయింది. సీనియర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొంగల్‍కే రావాల్సిన మూవీ వాయిదా పడింది. తెలుగులో పట్టుదల పేరుతో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు ఈ విదాముయర్చి చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది.

విదాముయర్చి చిత్రం నేడు (మార్చి 3) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అనుకున్న దాని కంటే ముందే ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

విదాముయర్చి చిత్రం కమర్షియల్‍గా నిరాశపరిచింది. రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. అయితే, మొదటి నుంచే మిక్స్డ్ టాక్ దక్కించుకుంది...