భారతదేశం, ఏప్రిల్ 17 -- తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ శివంగి స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా శివంగి ఓటీటీలోకి వ‌చ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. తెలుగుతో పాటు త‌మిళ వెర్ష‌న్ కూడా గురువార నుంచే ఆహా త‌మిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

శివంగి మూవీలో ఆనంది, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీకి దేవ‌రాజ్ భ‌ర‌ణి ధ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లిమిటెడ్ బ‌డ్జెట్‌, ఆర్టిస్టుల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా శివంగి మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమా క‌థ మొత్తం సింగిల్ లొకేష‌న్‌లో సాగుతుంది.

మార్చి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఆనంది యాక్టింగ్ బాగుంద‌నే కామెంట్స్ వినిపించా...