భారతదేశం, ఏప్రిల్ 14 -- 'ది లాస్ట్ ఆఫ్ అజ్' వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. రెండేళ్ల కిందట వచ్చిన ఈ అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ భారీ వ్యూస్ దక్కించుకుంది. పెడ్రో కాస్టెల్, బెల్లా రామ్సే ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఇండియాలోనూ ఫేమస్ అయింది. దీంతో రెండో సీజన్‍ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత 'ది లాస్ట్ ఆఫ్ సీజన్ 2' స్ట్రీమింగ్‍‍కు వచ్చేసింది.

లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 నేడు (ఏప్రిల్ 14) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ రెండో సీజన్‍లో ఫస్ట్ ఎపిసోడ్ నేడు అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

లాస్ట్ ఆఫ్ అజ్ రెండో సీజన్‍లో మొత్తంగా ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ నేడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో అ...