Hyderabad, మార్చి 27 -- OTT Spy Action Thriller Web Series: ఇండియన్ ఓటీటీలోకి వచ్చిన అద్భుతమైన వెబ్ సిరీస్ లలో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి 2019లో తొలి సీజన్ తో అడుగుపెట్టిన ఈ సిరీస్.. ఇప్పటికే రెండో సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కోసం కొన్నేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాదే ఆ కొత్త సీజన్ రాబోతోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ స్ట్రీమింగ్ పై ఇందులో లీడ్ రోల్ పోషించిన మనోజ్ బాజ్‌పాయీ అప్డేట్ ఇచ్చాడు. ఈ మధ్య జరిగిన ఓటీటీప్లే అవార్డుల కార్యక్రమంలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ సిరీస్ మూడో సీజన్ రానున్నట్లు అతడు తెలిపాడు. ఈ సిరీస్ లో అతడు శ్రీకాంత్ తివారీ అనే స్పై పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

కొత్త సీజన్ గురించి ప్రశ్నించిన సమయంలో మన...