Hyderabad, మార్చి 20 -- OTT Sports Dramas: ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ఏంటో ఇక్కడ చూడండి. ఈ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలు.. మంచి వినోదాన్ని అందించడంతోపాటు మనలో స్ఫూర్తిని కూడా నింపుతాయి. ఐపీఎల్ క్రేజ్ మధ్య ఇక్బాల్, జెర్సీలాంటి మరిన్ని బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాలను ఓటీటీలో చూడండి.

ఈ 83 మూవీ ఇండియన్ క్రికెట్ టీమ్ 1983లో గెలిచిన వరల్డ్ కప్ నేపథ్యంలో సాగుతుంది. అసలు ఏమాత్రం అంచనాలు లేని టీమిండియా కపిల్ దేవ్ సారథ్యంలో ఎలా విశ్వవిజేతగా మారిందో కళ్లకు కట్టినట్లు చూపించిన మూవీ ఇది. కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లలో అందుబాటులో ఉంది.

జెర్సీ మూవీ 2019లో వచ్చిన తెలుగు స్పోర్ట్స్ డ్రామా. ఓ విఫల క్రికెటర్ అయి...