Hyderabad, మార్చి 25 -- OTT Sports Drama: జీవితం మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీరో హీరో అవుతారా లేక విలనా? ఇప్పుడు సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ టెస్ట్. తమిళ స్టార్ హీరోలు మాధవన్, సిద్ధార్థ్ తోపాటు నయనతార, మీరా జాస్మిన్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే రాబోతోంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజైంది.

టెస్ట్ ఓ తమిళ స్పోర్ట్స్ డ్రామా. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. మంగళవారం (మార్చి 25) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇండియా తరఫున ఓ గొప్ప క్రికెటర్ కావాలని కలలు కనేది ఒకరు.

అదే దేశం కోసం పొల్యూషన్ లేని వాహనాలను అందించాలనని కృషి చేసేది మరొకరు. తల్లి కావాలని ఆరాటపడుతూ తన చివరి అవకాశం అదే అని తెలుసుకొని తల్లడిల్లిపోయే వ్యక్తి ఇంకొక...