భారతదేశం, జనవరి 30 -- బాలీవుడ్ యాక్షన్ స్టార్, అందరూ ప్రేమగా పిలుచుకునే 'ఖిలాడీ కుమార్' అక్షయ్ కుమార్ మళ్లీ తన పాత గూటికి చేరుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన పూర్తిస్థాయి హోస్ట్‌గా బుల్లితెరపై కనిపిస్తున్నారు.

అంటే, సుమారు పదేళ్లకు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు ఖిలాడీ అక్షయ్ కుమార్. సోనీ టీవీలో ప్రారంభమైన ప్రసిద్ధ గేమ్ షో 'వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' (Wheel of Fortune) భారతీయ వెర్షన్‌కు అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

అక్షయ్‌కి బుల్లితెర కొత్తేమీ కాదు. 2004లో 'సెవెన్ డెడ్లీ ఆర్ట్స్'తో మొదలైన ఆయన బుల్లితెర ప్రయాణం, 'ఖత్రోన్ కే ఖిలాడీ' (2008-2011)తో శిఖర స్థాయికి చేరింది. ఆ తర్వాత మాస్టర్ చెఫ్ ఇండియా, డేర్ 2 డ్యాన్స్ వంటి షోలతో అలరించిన అక్షయ్ కుమార్ చివరగా 2017లో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'లో కాసేపు మెరిశారు. మళ్లీ ...