Hyderabad, జనవరి 2 -- Neeli Megha Shyama OTT Release Date: ఆహా వీడియో ఓటీటీ ఈ మధ్య వరుస ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ నీలి మేఘ శ్యామ రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని గతంలోనే అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. గురువారం (జనవరి 2) తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది. మరో వారంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

గతేడాది తెలుగులో లోబడ్జెట్ మూవీగా వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించిన 35 చిన్న కథ కాదు మూవీలో నటించిన విశ్వదేవ్ రాచకొండ లీడ్ రోల్లో ఈ నీలి మేఘ శ్యామ మూవీ వస్తోంది. ఈ సినిమాను జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది.

"మీతో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ, ఎమోషన్స్, స్టోరీస్ కు సంబంధించిన విభిన్నమైన షేడ్స్.. నీలి మేఘ శ్యామ జనవరి 9న ఆహా...