Hyderabad, ఫిబ్రవరి 6 -- OTT Romantic Comedy Movie: తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ కాదలిక్క నేరమిళ్లై (Kadhalikka Neramillai) అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. గురువారం (ఫిబ్రవరి 6) నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. నిత్య మేనన్, జయం రవి జంటగా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఫర్వాలేదనిపించింది.

కాదలిక్క నేరమిళ్లై అంటే ప్రేమించడానికి టైమ్ లేదు అని అర్థం. ఈ సినిమా జనవరి 14న పొంగల్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర రూ.16.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 6) తమ సోషల్ మీడియా ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.

"ప్రేమించడానికి టైమ్ లేదా? విధి మాత్రం దానికి అ...