Hyderabad, ఏప్రిల్ 9 -- OTT Romantic Comedy: టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మనమే. భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ మూవీ.. గత నెలలోనే ఓటీటీలోకి వచ్చింది. వివిధ కారణాల వల్ల డిజిటల్ ప్రీమియర్ ఆలస్యమైంది. అయితే ఇప్పుడు నెల రోజుల్లోనే మరో ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది.

మనమే మూవీ మార్చి 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఏప్రిల్ 11 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచే ఈ సినిమా ఆహాలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (ఏప్రిల్ 9) వెల్లడించింది.

మ‌న‌మే సినిమాలో శ‌ర్వానంద్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది జూన్‌లో థియేట‌ర్...