భారతదేశం, మార్చి 16 -- తమిళ స్టార్ ధనుష్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే దర్శకత్వంపై కూడా ఫోకస్ చేశారు. గతేడాది ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన రాయన్ మంచి హిట్ అయింది. తన మేనల్లుడు పవిశ్ నారాయణన్ హీరోగా ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (NEEK)' గత నెల ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఈ 'నీక్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది.

నీక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ వారంలోనే మార్చి 21వ తేదీన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుందని రూమర్లు బయటికి వచ్చాయి. ఈ విషయంపై ఆ ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అప్‍డే...