భారతదేశం, ఫిబ్రవరి 7 -- మలయాళంలో రొమాంటిక్ కామెడీ మూవీ వివేకానంద‌న్ విర‌ల‌ను తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. వివేకానంద‌న్ వైర‌ల్ పేరుతో ఆహా ఓటీటీలో శుక్ర‌వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో టామ్ షైన్ చాకో హీరోగా న‌టించాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో షైన్ టామ్ చాకోకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు క‌నిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై క‌థానాయిక‌గా న‌టించారు.

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన వివేక‌నంద‌న్ వైర‌ల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. షైన్ టామ్ చాకో యాక్టింగ్‌తో పాటు సినిమాలోని మెసేజ్ బాగుదంటూ కామెంట్స్ వ‌చ్చాయి. వివేక‌నంద‌న్ వైర‌ల్ మూవీకి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ క‌మ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

వివేకానంద‌న్ వైర‌ల్‌... కథ విషయానికి వస్తే....