Hyerabad, ఫిబ్రవరి 10 -- OTT Romantic Comedy: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (Love Under Construction). మొత్తంగా ఏడు భాషల్లో వస్తున్న ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 10) రిలీజ్ చేశారు. నీరజ్ మాధవ్, అజు వర్గీస్, గౌరి జీ కిషన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ కొత్త ఇల్లు, లవర్ మధ్య చిక్కుకొని ఉక్కిరిబిక్కిరయ్యే ఓ యువకుడి చుట్టూ తిరుగుతుంది.

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ ను కొన్నాళ్ల కిందటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. ఈ వాలెంటైన్స్ డేకే వస్తుందని భావించారు. అయితే మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

గల్ఫ్ వెళ్లి కాస్త డబ్బులు పోగేసి సొంత...