Hyderabad, ఏప్రిల్ 11 -- OTT Romantic Comedy: తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ స్వీట్ హార్ట్. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. బాయ్‌ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసిన అమ్మాయి ఏం చేసిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ స్వీట్ హార్ట్ శుక్రవారం (ఏప్రిల్ 11) ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

మార్చి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చారు.

స్వీట్ హార్ట్ మూవీని స్వినీత్ ఎస్...