Hyderabad, మార్చి 6 -- OTT Romantic Comedy: ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు ఒకటికి మంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కావడం సాధారణంగా మారిపోయింది. అలా హెబ్బా పటేల్ నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ధూమ్ ధామ్ కూడా థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది.

చేతన్, హెబ్బా పటేల్ జంటగా నటించిన మూవీ ధూమ్ ధామ్. ఈ సినిమా గతేడాది నవంబర్ 8న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ కూడా మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. గురువారం (మార్చి 6) నుంచి ఈ ప్లాట్‌ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది.

"ధూమ్ ధామ్ ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎదురుచూపులు ముగిశాయి. చేతన్, హెబ్బా పటేల్ నటించిన ఈ సరదా, ప్రేమతో నిండిన, నవ్వులు, వినోదాన్ని పంచే రొమాంటిక్ కామెడీని చూడండి" అ...