Hyderabad, మార్చి 17 -- Kaadhal Enbadhu Podhu Udamai OTT Release: ఓటీటీలోకి ఎవరు ఊహించని కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. జోనర్ ఎలాంటిది అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు మాత్రం ఆదరణ చూపిస్తున్నారు. అయితే, కొన్నిసార్లు బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలకు వివాదాలు ఎదురవుతుంటాయి.

అలా కాంట్రవర్సీ ఎదుర్కొన్న తమిళ సినిమానే కాదల్ ఎంబదు పోదు ఉడమై (Kaadhal Enbadhu Podhu Udamai). తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన కాదల్ ఎంబదు పోదు ఉడమై సినిమా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనే బోల్డ్ కాన్సెప్ట్‌పై తెరకెక్కింది. ఈ మధ్య కాలంలో అబ్బాయి-అబ్బాయి, అమ్మాయి-అమ్మాయి, స్వలింగ సంపర్కం వంటి విషయాలు చూస్తున్నాం.

ఇలాంటి అమ్మాయి-అమ్మాయి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడంలో తప్పులేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 2023లో తెరకెక్కిన ఈ సినిమాను...