భారతదేశం, ఏప్రిల్ 1 -- బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన లవ్‍యాపా చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళంలో బ్లాక్‍బస్టర్ అయిన లవ్‍టుడే మూవీకి హిందీ రీమేక్‍గా ఇది తెరకెక్కింది. అయితే, లవ్‍యాపా నెగెటివ్ టాక్ తెచ్చుకొని భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ లవ్‍యాపా చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

లవ్‍యాపా చిత్రం ఏప్రిల్ 4వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో రానుందని తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

లవ్‍యాపా చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇద్దరు ప్రేమికులు ఒకరి ఫోన్ ఒకరు మార్చుకోవడం చుట్టూ ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సాగుతుంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన లవ్‍టుడే చిత్రం తమిళంల...