Hyderabad, ఫిబ్రవరి 18 -- OTT Bold Movie Vivekanandan Viral Review Telugu: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో కూడా బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సినిమాలు ఇటీవల కాలంలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అలా రీసెంట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళ బోల్డ్ సినిమానే వివేకానందన్ వైరల్.

దసరా విలన్ షైన్ టామ్ చాకో, గ్రేసీ ఆంటోనీ, స్వాసిక, మరీనా మైఖేల్ కురిసింగల్, జానీ ఆంటోనీ, మంజు పిల్లై, పార్వతి మాల తదితరులు కీలక పాత్రలు పోషించిన వివేకానందన్ వైరల్ సినిమాకు కమలర్ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7 నుంచి ఆహాలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ఓటీటీ బోల్డ్ మూవీ ఎలా ఉందో నేటి వివేకానందన్ వైరల్ రివ్యూలో తెలుసుకుందాం.

వివేకానందన్ కేరళలోని ఓ గ్రామంలో భార్య సితార (స్వాసిక), కూతురు, తల్లి సావిత్రి టీచర్‌తో (పార్వతి మాల) క...