Hyderabad, మార్చి 27 -- OTT Movie The Shadow Strays Review Telugu: ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన మోస్ట్ వయోలెంట్ క్రైమ్ యాక్షన్ సినిమా ది షాడో స్ట్రేస్. ఇందులోని హింస, రక్తపాతం ఏమాత్రం తట్టుకోలేనివిధంగా ఉంటుంది. అందుకే ఏకంగా 10 దేశాలు ఈ సినిమాను బ్యాన్ చేసేశాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతకుమించి 85 దేశాల్లో ది షాడో స్ట్రేస్ ట్రెండింగ్‌లో నిలిచి సత్తా చాటింది.

రక్తపాతం, ఊహించని వయోలెంట్ యాక్షన్ సీన్లతో ది షాడో స్ట్రేస్ సినిమాను టిమో త్జాజాంటో తెరకెక్కించారు. 10కి 6.5 ఐఎమ్‌డీబీ రేటింగ్, రొటెన్ టొమోటోస్ నుంచి 91 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా నిలిచిన ది షాడో స్ట్రేస్ సినిమాలో అరోరా రిబేరో మెయిన్ లీడ్ రోల్ చేసింది.

ఇంకా హనా ప్రినాంటినా, టస్క్య నమ్యా, ఆండ్రీ మషాది, ఆగ్రా పిలైంగ్, క్రిస్టో ఇమ్మాన్యూయెల్, అలీ ఫిక్రీ, అదిపతి డొల...