Hyderabad, ఫిబ్రవరి 4 -- OTT Revenge Crime Thriller Kobali Release Today: ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఓటీటీ కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో విపరీతమైన వయలెన్స్, పచ్చి బూతులు, అడల్ట్ సీన్స్‌తో ఇదివరకు చాలా సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చేశాయి.

హిందీ, ఇంగ్లీష్‌లో ఇలాంటి సినిమాలు నిత్యం వస్తూనే ఉంటాయి. కానీ, తెలుగులో బూతులు, వయెలెన్స్‌తో వచ్చిన ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు చాలా అరుదు. ఇటీవల కాలంలో తెలుగులోనూ ఇలాంటి కంటెంట్‌తో మూవీస్, సిరీసులు తెరకెక్కుతోన్నాయి. తాజాగా ఇలాంటి కంటెంట్‌తో వచ్చిన తెలుగు వెబ్ సిరీసే కోబలి.

ప్రముఖ తెలుగు నటుడు రవి ప్రకాష్ ప్రధాన పాత్రలో తెరెకక్కిన కోబలి వెబ్ సిరీస్‌కు రేవంత్ లెవక దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో రవి ప్రకాష్‌తోపాటు యాంకర్ శ్యామల, రాకీ ...