భారతదేశం, మార్చి 31 -- మార్చిలో సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, రేఖాచిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, పొన్‍మ్యాన్ సహా చాలా సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్‍లు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు ఏప్రిల్‍ తొలి వారంలోనూ వివిధ ఓటీటీల్లో నయా చిత్రాలు, సిరీస్‍లు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మల్టీస్టార్టర్ చిత్రం టెస్ట్ డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ తమిళ చిత్రంతో పాటు రెండు తెలుగు వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఏప్రిల్ తొలి వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి. చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

హోమ్‍టౌన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ తొలి వారంలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఏప్రిల్ 4న ఈ తెలుగు ఫ్యామిలీ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యద్మ, యానీ ఈ సిరీస్‍లో ప్రధా...