భారతదేశం, ఏప్రిల్ 15 -- OTT Releases: ఒకే రోజు అమెజాన్ ప్రైమ్‌లోకి ఐదు తెలుగు సినిమాలు వ‌చ్చాయి. వీటిలో ఎక్కువ‌గా థ్రిల్ల‌ర్ సినిమాలే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ ఐదు సినిమాలు ఫ్రీగా కాకుండా రెంట‌ల్ విధానంలో అందుబాటులోకి వ‌చ్చాయి. 99 రూపాయ‌ల రెంట్‌తో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

బిగ్‌బాస్ సీజ‌న్ 2 బ్యూటీ సంజ‌న అన్నే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క్రైమ్ రీల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో సిరి చౌద‌రి, జ‌బ‌ర్ధ‌స్థ్ అభి, భ‌ర‌త్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ మూవీకి సంజ‌న అన్నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

సినిమాల‌పై ఇష్టంతో ఇంట్లో నుంచి పారిపోయిన మౌనిక అనే అమ్మాయి దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతుంది. మౌనిక‌...