Hyderabad, ఫిబ్రవరి 15 -- Rashmika Mandanna Chhaava Vishwak Sen Laila OTT Release: ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హిందీ చిత్రం ఛావా, విశ్వక్ సేన్ తెలుగు సినిమా లైలా ఆసక్తిగా మారాయి. ఇప్పుడు ఛావా, లైలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటనే విషయం ఆసక్తికరంగా మారింది.

రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ హిస్టారికల్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఛావా. ఇందులో రష్మిక మందన్నాకు జోడీగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించాడు. ఛావా చిత్రాన్ని మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా సినిమాలో రష్మిక మందన్నా యేసు బాయి పాత్రలో నటించింది.

శంభాజీగా విక్కీ కౌశల్ యాక్ట్ చేశాడు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా...