భారతదేశం, ఫిబ్రవరి 18 -- వరుణ్ సందేశ్ హీరోగా నటించిన విరాజి చిత్రం గతేడాది ఆగస్టు 2న థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్ తర్వాత ఈ సైకలాజికల్ మూవీపై క్యూరియాసిటీ పెరిగింది. అయితే, అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఇప్పుడు రెండో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

విరాజి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు (ఫిబ్రవరి 18) స్ట్రీమింగ్‍కు వచ్చింది. కానీ, రూ.99 రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రం గతేడాది ఆగస్టు 22వ తేదీనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. ఆహాలో రెంట్ లేకుండా ఆ ప్లాట్‍ఫామ్ సబ్‍స్క్రైబర్లు చూడొచ్చు.

విరాజి చిత్రానికి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. ఓ మెంటల్ ఆసుపత్రికి చెందిన పాడుబడిన భవనంలో కొందరు చ...