భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఇటీవల తెలుగులో రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో లవ్ స్టోరీ సినిమాలు బాగానే వస్తున్నాయి. అందులో చాలా వరకు సినిమాలు మంచి హిట్స్ సాధిస్తున్నాయి. అదే తరహాలో రీసెంట్‌గా టాలీవుడ్‌లో తెరకెక్కిన విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామా సినిమా శ్రీ చిదంబరం గారు.

అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాతలు చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అలాగే, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు.

శ్రీ చిదంబరం సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట హీరో హీరోయిన్లుగా చేశారు. వీరితోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఫిబ్రవరి 6న ...