Hyderabad, మార్చి 3 -- OTT Political Thriller: ఓటీటీలో వచ్చిన బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మహారాణి. 2021లో తొలి సీజన్ తో మొదలైన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా రాబోతోంది. బీహార్ రాజకీయాల నుంచి స్ఫూర్తి పొంది, కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ నాలుగో సీజన్ టీజర్ వచ్చేసింది.

మహారాణి తొలి సీజన్ 2021లో వచ్చింది. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ స్ట్రీమింగ్ అయ్యాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి.. బీహార్ సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబంధులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. తాజాగా రిలీజైన నాలుగో సీజన్ టీజర్లో ఆమె పాత్ర మరింత బలంగా మారినట్లు కనిపిస్తోంది.

"కొందరు నన్ను నిరక్ష్యరాస్యురాలిని అన్నారు. ఇంకొందరు హంతకురాలు అన్నారు. మరికొంద...