Hyderabad, ఏప్రిల్ 15 -- OTT Platforms: ఓటీటీ అనగానే సాధారణంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటివే అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఇవి కాకుండా సోనీ లివ్, జీ5, ఆహా వీడియో, జియోహాట్‌స్టార్ కూడా తెలుసు. అయితే వీటితోపాటు మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. అవేంటో చూడండి. అందులోని కంటెంట్ కూడా ఫాలో అవండి.

బోల్డ్ కంటెంట్ కు కేరాఫ్ ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఉల్లు అంటే గుడ్లగూబ అని అర్థం. 2018లో ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ఇందులో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వరకు అడల్ట్ ఓరియెంటెడ్ గానే ఉంటాయి. ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తో పోలిస్తే ఈ ఓటీటీ ఈ విషయంలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం బోల్డ్ కంటెంటే కావాలని అనుకున్న వాళ్లకు ఈ ఉల్లు బెస్ట్ ఆప్షన్. ఇందులో మూడు వెబ్ సిరీస్, సినిమాల వరకు ఫ్రీగా చూసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత సబ్‌స్క్రైబ్ చేసు...