భారతదేశం, జనవరి 21 -- యువ హీరో ఆది సాయికుమార్ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసిన సినిమా 'శంబాల' (Shambhala). యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. గురువారం (జనవరి 22) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా వీడియో'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ శంబాల సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆది సాయికుమార్ కెరీర్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సినిమా ఇదే. 'ఆహా వీడియో' ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనివల్ల సినిమా థియేటర్లలో విడుదల కాకముందే నిర్మాతలు లాభాల బాట పట్టారు.

ఈ శంబాల సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆది సాయికుమార్ మా...