భారతదేశం, మార్చి 12 -- OTT Mystery Thriller: కోలీవుడ్ మ‌ర్డ‌ర్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సీసా ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్అ య్యింది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. మార్చి 14 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో సీసా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

సీసా మూవీలో న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌మ్ (న‌ట్టీ) హీరోగా న‌టించాడు. నిశాంత్ రూసో, నిళ‌ల్‌గ‌ళ్ ర‌వి, ప‌ర్‌దైన్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి గుణ సుబ్ర‌మ‌ణియ‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన సీసా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌ట్టీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందంటూ పేర్కొన్నారు.

ఆన్‌లైన్ గేమ్స్ కు బానిస‌గ...