భారతదేశం, మార్చి 18 -- OTT Mystery Thriller: మ‌ల‌యాళం మూవీ బిగ్‌బెన్ థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో అను మోహ‌న్‌, విన‌య్ ఫోర్ట్‌, అదితి రివి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. బినో అగ‌స్టీన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మార్చి 28 నుంచి బిగ్‌బెన్ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని స‌న్ నెక్స్ట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్ మాత్రం రిలీజ్ అవుతోన్న‌ట్లు వెల్ల‌డించింది.

గ‌త ఏడాది జూలైలో బిగ్‌బెన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. విదేశీ చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న లేక భార‌తీయులు ప‌డే ఇబ్బందుల‌ను మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీలో ఆవిష్క‌రించాడు.

కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఇంట్రెస్టింగ్‌గా డైరెక...