Hyderabad, మార్చి 6 -- OTT Mystery Crime Thriller: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా.. ఇవి చాలు కదా రేఖాచిత్రమ్ (Rekhachithram) మూవీపై ఎక్కడ లేని ఆసక్తి పెరగడానికి. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

మలయాళ స్టార్ నటుల్లో ఒకరైన ఆసిఫ్ అలీ నటించిన మూవీ రేఖాచిత్రమ్. ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మార్చి 7) నుంచి సోనీలివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. రూ.55 కోట్ల వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

ఈ సినిమా కోసం చాలా రోజులుగా ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగు సహా మొత్తం ఆరు భాషల్లో రేఖాచిత్రమ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు ...