Hyderabad, ఏప్రిల్ 6 -- OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ఇవాళ నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అది కూడా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయ్యాయి. ఫ్యామిలీ డ్రామా, లవ్ రొమాంటిక్ జోనర్స్‌తో ఆ రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి, మిగతా సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇటీవల మొదలుపెట్టిన సరికొత్త ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధ. అంటే, ఇందులో ప్రతి ఆదివారం కొత్త సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే ఒక ఎపిసోడ్ తరహాలో ప్రతి ఆదివారం కేవలం దాదాపుగా 30 నిమిషాల రన్ టైమ్‌తో కథా సుధా ఓటీటీ వీక్లీ సిరీస్‌ను డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నారు.

సతీష్ వేగేశ్న, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో ఈ సినిమాల...