Hyderabad, ఫిబ్రవరి 10 -- Aha OTT Movies And Web Series In 2025: ఓటీటీల హవా పెరిగిపోతుంది. అందుకే పోటా పోటీగా సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మునుముందు స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీసులు, షోల జాబితాను ప్రకటించేస్తున్నాయి.

వాటిలో ఒకటే ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్. అచ్చ తెలుగు ఓటీటీ సంస్థగా పేరు తెచ్చుకున్న ఆహా ఇతర భాషా సినిమాలు, సిరీస్‌లను సైతం తెలుగులో అందిస్తోంది. అలాగే, ఆహా ఒరిజిల్స్ పేరుతో క్రియేటివ్ వెబ్ సిరీసులను రూపొందిస్తోంది. ఇలాంటి ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 2025 సంవత్సరంలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు, షోల జాబితాను ఓ వీడియో రూపంలో ప్రకటించేసింది.

టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఓటీటీ తెలుగు బోల్డ్ వెబ్ స...