భారతదేశం, ఏప్రిల్ 2 -- ఈనెల (ఏప్రిల్)లో ఓటీటీల్లో హిందీలో సినిమాలు చూడాలనుకునే వారికి అదిరిపోయే ఆప్షన్లు రానున్నాయి. వివిధ జానర్లలో ఐదు బాలీవుడ్ చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. బ్లాక్‍బస్టర్ మూవీ ఛావా కూడా ఓటీటీలోకి వచ్చేయనుంది. రెండు చిత్రాలు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈనెల ఓటీటీల్లోకి రానున్న టాప్-5 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

హిందీ హారర్ థ్రిల్లర్ చిత్రం 'చోరీ 2' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన చోరీ చిత్రానికి సీక్వెల్‍గా ఇది వస్తోంది. చోరీ 2 సినిమాలో నుష్రత బరుచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. దుష్టశక్తి నుంచి తన కూతురిని తల...