భారతదేశం, ఏప్రిల్ 21 -- ఓటీటీల్లోకి ఈవారం చాలా చిత్రాలు క్యూ కట్టేందుకు రెడీ అయ్యాయి. వీటిలో ఆరు సినిమాలు ఇంట్రెస్టింగ్‍గా అనిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ అయిన ఎల్2: ఎంపురాన్ ఈ వారం (ఏప్రిల్ నాలుగో వారం)లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రశంసలను పొందిన విక్రమ్ హీరోగా చేసిన చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్-6 సినిమాలు ఇవే.

మలయాళ స్టార్ హీరో మోహన్‍లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఎల్2: ఎంపురాన్ సినిమా ఈ గురువారం ఏప్రిల్ 24న జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీకి పృథ్విరాజే దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏప్రిల్ 24న హాట్‍స్టార్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లూసిఫర్ మూవీకి సీక్వెల్‍గ...