భారతదేశం, ఫిబ్రవరి 16 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం (ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 22) మరిన్ని సినిమాలు, సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని రిలీజ్‍లు ఆసక్తిని రేపుతున్నాయి. చాలా మంది ఎదురుచూస్తున్న డాకు మహరాజ్ చిత్రం ఈ వారమే స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ మలయాళ బ్లాక్‍‍బస్టర్ తెలుగులో మరో ఓటీటీలోకి వస్తోంది. ఓ ఆసక్తికర వెబ్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో ఐదు టాప్ రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

డాకు మహరాజ్ చిత్రం ఈ శుక్రవారమే (ఫిబ్రవరి 21) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన డాకు మహరాజ్ బ్లాక్‍బస్టర్ కొట్టింది. సుమారు 40 రోజులకు ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవ...